NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరులో నిర్వహిస్తున్న ఫుడ్ ఇంజనీర్స్ కు జొమాటో అవార్డు

1 min read

రాష్ట్రవ్యాప్తంగా జొమాటో పోటీలు

మొదటి బహుమతి కైవసం చేసుకున్న ఫుడ్ ఇంజనీర్స్ అధినేత ఉర్ల శ్రీనివాస్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు : ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కేటగిరీలలో పోటీలు నిర్వహించింది. ఏలూరు నగరంలో కూడా ఈ పోటీలు నిర్వహించగా ఫుడ్ ఇంజనీర్స్ రెస్టారెంట్ కు ఏలూరు నగరంలోని మొదటి బహుమతి లభించింది. జొమాటో ఆన్లైన్ సంస్థ ఏలూరు మేనేజర్ సుభాషిని తెలిపిన వివరాల ప్రకారంగత ఆరు నెలల కాలంలో జొమాటోలో ఆన్లైన్ కస్టమర్లు పెట్టుకుని ఆర్డర్లను  ఆలస్యం లేకుండా ఇవ్వడం, కస్టమర్లు రిపీటెడ్ గా అదే రెస్టారెంట్ నుంచి ఆర్డర్లు పెట్టడం,వారు పెట్టిన ఆర్డర్లు కంప్లైంట్ లు లేకపోవడం వంటి మూడు కేటగిరీలో జొమాటో పోటీ నిర్వహించింది. ఈ పోటీల్లో ఏలూరు కోర్టు సెంటర్లో నిర్వహిస్తున్న  ఫుడ్ ఇంజనీర్స్ రెస్టారెంట్ కు1 స్థానం లభించింది. శుక్రవారం జోమాటో సంస్థ మేనేజర్లు సుభాషిని, దివాకర్ లు ఈ అవార్డును ఫుడ్ ఇంజనీర్స్ ఉర్ల శ్రీనివాస్ కు అందించారు. శ్రీనివాస్ జొమోటో మేనేజర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

About Author