NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సమైక్య భారత శిల్పి సర్దార్   వల్లభాయ్ పటేల్: ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు:  ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి 2025 అక్టోబర్ 31న ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్బంగా  ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం  మాట్లాడుతూ భారతమాత  ముద్దు బిడ్డ, మొదటి హోమ్ శాఖ మంత్రి  సర్దార్ వల్లభాయ్ పటేల్  మన అందరికి ఆదర్శ ప్రాయుడు స్వాతంత్ర్యం తర్వాత 560కి పైగా ఉన్న స్వదేశీ  సంస్థానాలను  సమైక్యం భారత్ లో విలీనం చేసి భారతదేశం ఏకరీతిగా నిలబడటానికి మౌలిక మార్గం చూపి పటేల్ దేశ రాజకీయ ఐక్యతకు కీలక పాత్ర వహించారు. కేంద్ర ప్రభుత్వం 2014 నుండి ఆయన జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుతూ భారతదేశ భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రేరేపిస్తోంది. గుజరాత్ లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద ఆయన విగ్రహం, దేశ ఐక్యతకు చిహ్నంగా నిలుస్తోంది. ఈ జయంతి వేడుకలు దేశ సమైక్యత, దృఢ సంకల్పం కోసం స్ఫూర్తిగా నిలుస్తాయి అని కొనియాడారు. అనంతరం పటేల్ చిత్ర పటానికి పూలమాల వేసి విద్యార్థుల చేత జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పిఓ నవీన పాటి అధ్యాపకులు :రామకృష్ణయ్య ,ఓబులేసు , వెంకటరమణ ,వెంకటేశ్వర్లు ,మద్దిలేటి ,మురళి మోహన్ ,ముస్తాక్ ,శంకరయ్య ,సురేష్ ,మంజునాథ్ వన్నూర్ మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.

About Author