ప్రభుత్వ అసమర్ధకు నిదర్శనం జోగి రమేష్ అరెస్ట్
1 min read

వైసీపీ రాష్ట్ర ఎస్ ఇ సి సభ్యుడు సత్య సాయినాథ్ శర్మ
న్యూస్ నేడు కమలాపురం : రాష్ట్రంలో కల్తీ మద్యం కేసులో రాష్ట్ర మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ చేయడం కూటమి ప్రభుత్వ అసమర్ధకు నిదర్శనమని వైసీపీ రాష్ట్ర ఎస్ ఇ సి సభ్యుడు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ అన్నారు. కమలాపురంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర మాజీ మంత్రి జోగీ రమేష్ తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సిబిఐ చేత విచారణ చేయాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసిన మరుసటిరోజే పోలీసులు జోగి రమేష్ అరెస్ట్ చేయడం గమనిస్తే కూటమి ప్రభుత్వ డొల్లతనం ప్రజాస్వామ్యానికి తిలోదకాలిస్తున్న విషయం బయటపడుతోందన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన తంబళ్లపల్లె నియోజకవర్గ ఆ పార్టీ అభ్యర్థి జయచంద్రారెడ్డి ఆయన వెంట చంద్రబాబు నాయుడుతో కలిసి పార్టీ కండువా కప్పించుకున్న జనార్ధన రావు ఇద్దరు కలిసి చేస్తున్న కల్తీ మధ్య వ్యాపారంలో వైసీపీ నాయకులను బాధ్యులను చేయడం చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వ పనితీరు హాస్యాస్పదంగా మారిందన్నారు. 16 నెలలుగా అధికార పార్టీ నాయకులు కల్తీ మద్యం వ్యాపారం చేస్తున్న విషయాన్ని వైసీపీ నాయకులు బయట పెట్టి ఎక్సైజ్ పోలీసుల ద్వారా దాడి చేపిస్తే కల్తీ మద్యాన్ని పట్టుకున్న పోలీసు ఆఫీసర్ ను తక్షణమే బదిలీ చేయడం వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత కాదా అని ఆయన ప్రశ్నించారు. పార్టీలోని నేతలు కల్తీ మద్యానికి బాధ్యులు అయితే వారిచేత రాష్ట్ర మాజీ మంత్రి జోగి రమేష్ పై అసత్యపు ఆరోపణలు చేపించి అరెస్టు చేపించడం కూటమి ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనంగా నిలుస్తోందన్నారు. ప్రస్తుతం వైసీపీ నాయకుల పట్ల కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును గమనిస్తుంటే ఈ ప్రభుత్వం ఎవరి మీద అయితే కక్షగడుతుందో వారిని అరెస్టు చేయడానికి ఎన్ని తప్పుడు దారులు ఎంచుకుంటుందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు చేసి ఉంటే తెలుగుదేశం పార్టీలోని నాయకులందరినీ ఇలాంటి కేసులలో ఇరికించి జైలు పాలు చేసి రాజకీయ జీవితానికి దూరం చేసేవారన్నారు. జగన్మోహన్ రెడ్డి మంచి మనసుతో నిజాయితీగా పరిపాలన చేశాడు కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు తమ మనుగడ కొనసాగించగలుగుతున్నారన్నారు. రాష్ట్రంలో పరిపాలన రోజురోజుకు విఫలమై దిగజారుతున్న కూటమి ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ నాయకుల అరెస్టును బూచిగా చూపుతోందన్నారు. రాష్ట్రంలో కల్తీ మద్యం కేసులో వైసీపీ నాయకులను బాధ్యులుగా చేసి తన అసమర్థతను ప్రభుత్వం నిరూపించుకుందన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కల్తీ మద్యం కేసులో ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి తనపై కూటమి ప్రభుత్వం కక్ష గట్టి చేపిస్తున్న ఆరోపణలకు ధీటుగా ధైర్యంగా సిబిఐ విచారణ చేయాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నందు పిటిషన్ వేసారన్నారు. కల్తీ మద్యం కేసులో సిబిఐ విచారణ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా కల్తీ మద్యం కేసులో ఇరికిస్తున్న విషయాన్ని సిబిఐ బహిరంగం చేస్తుందన్న భయంతో జోగి రమేష్ ను అరెస్టు చేశారన్నారు. చంద్రబాబు నాయుడు 16 సంవత్సరాల ముఖ్యమంత్రి అనుభవం కేవలం వైసీపీ నాయకుల అక్రమ అరెస్టుకు మాత్రమే ఉపయోగిస్తున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. రాజకీయాల కతీతంగా జోగి రమేష్ అరెస్టును ముక్తకంఠంతో అందరూ ఖండించాలని ఆయన కోరారు .

