NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

 కుష్టి వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

1 min read

సమష్టి కృషితోనే సాధ్యం ..

  • జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి

కర్నూలు, న్యూస్​ నేడు: సమిష్టి కృషితో కుష్టి వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో  కుష్టు వ్యాధి గ్రస్తులకు గుర్తించే కార్యక్రమం అమలుకు సంబంధించి జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ… ప్రజలకు కుష్టు వ్యాధి లక్షణాలు, అపోహల గురించి  అవగాహన కల్పించి, జిల్లాలో కుష్టు వ్యాధి గ్రస్తులను గుర్తించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందులో  భాగంగా జిల్లాలో ఈనెల 17వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపయిన్ (LCDC) ద్వారా 14 రోజులపాటు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి అందరినీ పరీక్షించి సర్వేలో కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారికి తక్షణమే వైద్య సౌకర్యాలు అందించాలన్నారు. అలాగే కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తిని ప్రాథమిక దశలోనే గుర్తించి వైద్య సేవ అందించడం ద్వారా వ్యాధిని అరికట్టి, అంగవైకల్యం రాకుండా నివారించవచ్చని తెలియజేశారు. కాబట్టి జిల్లాలోని అన్ని అంగన్వాడి కేంద్రాలలో 02 నుండి 06 సంవత్సరాల వయసు పిల్లలకు మరియు జిల్లాలోని అన్ని పాఠశాలలో పిల్లలను, అలాగే సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులకు, కళాశాల విద్యార్థులకు కుష్టువ్యాధి లక్షణాలపై అవగాహన కల్పించి , వైద్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.  

‘ మల్టీ డ్రగ్ థెరపీ ’ తో త్వరగా నయం..

  • డీఎంహెచ్​ ఓ మరియు కుష్టు, ఎయిడ్స్​ టి.బి. అధికారి డా. భాస్కర్​

ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మరియు జిల్లా కుష్టు మరియు ఎయిడ్స్,  టీ.బి. అధికారి డాక్టర్ ఎల్ భాస్కర్ కుష్టు వ్యాధి లక్షణాలు తెలియజేస్తూ మల్టీ డ్రగ్ థెరపీ చికిత్స ద్వారా కుష్టు వ్యాధి త్వరగా నయం అవుతుందని తెలియజేస్తూ, ఈ మందులు ప్రతి ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా లభిస్తాయని తెలియజేస్తూ అలాగే 2027 నాటికి కుష్టు రహిత దేశంగా మారుద్దామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమన్వయ కమిటీ సభ్యులు డాక్టర్ పి లీనారెడ్డి, టి. హెచ్ వార్డు వైద్య అధికారి , రెడ్డి బాబు, పి.టి , డిప్యూటీ పారామెడికల్ అధికారులు , టి. చంద్రశేఖర్ రెడ్డి, వై. సుబ్రహ్మణ్యం, మరియు జిల్లా కుష్టు నివారణ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.

About Author