స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నందు ఈ రోజు జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది మరియు రోగులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ మాట్లాడుతూ క్యాన్సర్‌ను త్వరిత గుర్తింపు మరియు సమయానికి చికిత్స ద్వారా నివారించవచ్చు. ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అని తెలిపారు.ఆసుపత్రి సూపరిండెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు మాట్లాడుతూక్యాన్సర్పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడం, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేయడానికి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తాము” అన్నారు.కర్నూల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ చిట్టి నరసమ్మ మాట్లాడుతూక్యాన్సర్ చికిత్సలో నిపుణులు వివిధ రకాల క్యాన్సర్లు, వాటి లక్షణాలు, నివారణ చర్యలపై అవగాహన కల్పించారని అన్నారు. అలాగే హాస్పిటల్ క్యాంపస్‌లో క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు.వైద్యులు, విద్యార్థులు రోగులకు ఉచిత స్క్రీనింగ్ శిబిరాన్ని కూడా నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సిఎస్ఆర్ఎంఓ డా.హేమనలిని, ఆసుపత్రి ఆర్ఎంఓ, డాక్టర్ వెంకటరమణ, ప్రొఫెసర్ డా. ఉమా మహేశ్వర రెడ్డి,అసోసియేట్ ప్రొఫెసర్, డాక్టర్ శివ బాల,డా. బాలాజీ ప్రివెంటివ్ అంకలాజీ నోడల్ ఆఫీసర్ డా. నాగరాజు, డా.సాయి మాధురి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ కుమార్ మరియు వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

