‘ క్యాన్సర్ ’పై అవగాహన అవసరం
1 min read

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్.భాస్కర్
కర్నూలు హాస్పిటల్, న్యూస్ నేడు : సమాజంలో ప్రతి ఒక్కరూ క్యాన్సర్ పై అవగాహన పెంచుకోవాలని సూచించారు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్.భాస్కర్ . శుక్రవారం జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్.భాస్కర్ ర్యాలీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శరీరభాగంలో ఎక్కడైనా గడ్డలు, పుట్టు మచ్చల్లో మార్పులు,మాననీ పుండ్లు,గొంతులో గరగర,నిత్యం పొడి దగ్గు,మల,మూత్ర విసర్జన అలవాట్లలో మార్పులు,ఆహారము మింగతంలో ఇబ్బంది, ఆకలి మందగించడము,అసాధారణ రక్తస్రావం,నీరసం,వాంతులు,మలంలో రక్తం ,నలుపు మలం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలని తెలిపారు. క్యాన్సర్ నివారణ చర్యలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్సిడి 4.0 సర్వే జరుగుతుందని,18 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరికీ రొమ్ము,నోటి,సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నామని,అవసరమైన వారికి పరీక్షలు చేయడము,వ్యాధి నిర్ధారణ అయితే చికిత్స అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

