NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీడీపీ మాజీ ఇంచార్జి విక్టర్ కు పితృ వియోగం..

1 min read

నివాళులు అర్పించిన ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్యే..

నందికొట్కూరు, న్యూస్​ నేడు:  నంద్యాల జిల్లా నందికొట్కూరు మాజీ టీడీపీ ఇంచార్జ్ తమ్మడపల్లె విక్టర్, శేఖర్ తండ్రి పల్లె సౌందరాజు (90) గురువారం రా 8 గం.కు అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న నంది కొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మరియు మాజీ ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ నాయుడు పట్టణంలోని విక్టర్ కుటుంబాన్ని శుక్రవారం వారు వేరు వేరుగా కుటుంబాన్ని పరామర్శించి సౌందరాజు మృతదేహానికి వారు నివాళులు అర్పించారు.2వ వార్డ్ కౌన్సిలర్ మొల్ల జాకీర్ హుస్సేన్,పగిడ్యాల మండల కన్వీనర్ పలుచాని మహేశ్వర్ రెడ్డి,జనసేన రామిరెడ్డి,టీడీపీ నాయకురాలు డాక్టర్ వనజ,వేణు తదితరులు నివాళులు అర్పించారు.ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే మరియు మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు చెప్పారు.

About Author