NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వందేమాతర గీతం పై పాఠశాలలో అవగాహన

1 min read

ఎమ్మిగనూరు న్యూస్ నేడు:  ఎమ్మిగనూరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో  శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఈరోజు బిజెపి నాయకులు అసెంబ్లీ కో కన్వీనర్ తొగట నరసింహులు ,పట్టణ అధ్యక్షులు కోరిశెట్టి జెట్టప్ప పాల్గొని వందేమాతరం గీతo  ను ఆలపించారు. అలాగే 150 సంవత్సరాలు పూర్తి అయినా వందేమాతరం గురించి పిల్లలకు రెండు లైన్లో క్లుప్తంగా చెప్పారు. అలాగే ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంట్లో స్వదేశీ వస్తువులు  వాడడం గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  స్కూల్ హెడ్మాస్టర్ బాలప్ప ,తిరుమల , మాతాజీ లు  పట్టణ ప్రధాన కార్యదర్శి శివ, బండ రవి, గణప వీరేష్,ఈరన్న గౌడ్,రమణ, పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author