NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వన్యప్రాణులను వేటాడిన, చంపిన కఠిన శిక్షలు

1 min read

మహానంది, న్యూస్​ నేడు:  వన్యప్రాణులను వేటాడిన, చంపిన, వాటి మాంసాన్ని విక్రయించిన కఠిన చర్యలు తప్పవని వీఆర్వో హైమావతి పేర్కొన్నారు. మహానంది గ్రామపంచాయతీ నందు వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించి చాటింపు వేయించారు. 1972 చట్ట ప్రకారం పైన పేర్కొన్న వాటికి సంబంధించి 7 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉందన్నారు. వెదురు ఇతర అటవీ సంపద తరలిస్తూ పట్టుబడిన కూడా శిక్షలు కఠినంగా ఉంటాయన్నారు. అటవీ ప్రాంతంలోకి ప్రవేశించిన కూడా నేరమేనని హెచ్చరించారు. వృక్షో రక్షతి రక్షితః. వృక్షాలను మనం కాపాడితే అవి మనల్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాయని తెలియజేశారు. వన్యప్రాణుల వేటాడడం, చంపడం, వాటి మాంసాన్ని విక్రయించడం, వెదురు అటవీ సంపద అక్రమ రవాణా సంబంధించి ఎవరైనా వ్యక్తులు సమాచారాన్ని తమకు తెలియజేస్తే వారికి పారితోషికంగా వెయ్యి రూపాయలు ఇవ్వడం జరుగుతుందని డిఆర్ఓ హైమావతి తెలిపారు. సమాచారం అందజేసిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ బి వో ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

About Author