‘వందేమాతరం గీతం’దేశానికి ఎంతో స్ఫూర్తి..
1 min read

నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య..
నందికొట్కూరు , న్యూస్ నేడు: “వందేమాతరం గీతం”దేశానికి ఎంతో స్ఫూర్తినిచ్చిందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో శుక్రవారం ఉదయం ‘వందేమాతరం గీతం’రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలను పట్టణంలో పటేల్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో ఎమ్మెల్యేతో పాటు మున్సిపాలిటీ కమిషనర్ ఎస్.బేబీ,కౌన్సిలర్లు మరియు విద్యార్థులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వందేమాతరం గీతం ఆవిర్భవించి నేటికి 150 సం.లు అయ్యాయనిబెంగాలీ రచయిత బంకించంద్ర ఛటర్జీ 1875 లో రాసిన వందేమాతరం గీతం,భారత స్వాతంత్ర్య పోరాటంలో ఓ నినాదంలా మారి, భారతీయులందరిలో చైతన్యాన్ని నింపిందని వందేమాతరం గీతం స్ఫూర్తిని కొనసాగిద్దామని ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని అన్నారు.10 బొల్లవరంలో జరిగిన వేడుకల్లో మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి,పంచాయతీ కార్యదర్శి నూరుల్లా,ఉపాధ్యాయులు వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి,ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ,కౌన్సిలర్లు జాకీర్ హుస్సేన్,ధర్మారెడ్డి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.


