ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరంపై వైఎస్ఆర్సిపి అలుపెరుగని పోరాటం
1 min read

వైఎస్ఆర్సిపి నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు గుమ్మల్ల సాయికుమార్ రెడ్డి.
న్యూస్ నేడు చెన్నూరు: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు ప్రభుత్వ వైద్య కళాశాలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడం వల్ల వైద్య విద్యను అభ్యసించే పేద పేద విద్యార్థులు, అలాగే నిరుపేదలకు ప్రభుత్వ వైద్య సదుపాయం సక్రమంగా అమలు కాదని దీనిని కూటమి ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వైఎస్ఆర్సిపి కమలాపురం నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు గుమ్మల్ల సాయి కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన చెన్నూరులో విలేకరులతో మాట్లాడుతూ, వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులుపి. రవీంద్రనాథ్ రెడ్డి, వైయస్సార్ సిపి కమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ పోచం రెడ్డి నరేన్ రామాంజులరెడ్డి ఆదేశాల మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా “రచ్చబండ” కార్యక్రమం లో భాగంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడం పై ఇప్పటికే పెద్ద ఎత్తున నియోజకవర్గ వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉదృతంగా కొనసాగించడం జరుగుతుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు, పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటిలో కొన్ని పూర్తవుగా, కొన్ని వివిధ దశల నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గపు చర్య అని ఆయన అన్నారు. కమలాపురం నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్చార్జి యువనేత పోచం రెడ్డి నరేన్ రామాంజుల రెడ్డి నేతృత్వంలో విద్యార్థుల సమస్యలపై మరింత రాజీలేని పోరాటం సాగిస్తామని ఆయన తెలియజేశారు.

