NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరంపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే

1 min read

– రాష్ట్రంలో మెరుగైన వైద్యాన్ని అందించిన ఘనత మాజీ సీఎం డాక్టర్ వైఎస్ఆర్ దే

– వైఎస్ఆర్సిపి రాష్ట్ర ఎస్ ఈసీ సభ్యులు కాశీభట్ల సాయినాధ శర్మ

న్యూస్ నేడు చెన్నూరు :  మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని పేద  విద్యార్థులకు, నిరుపేదలకు మెరుగైన  వైద్య  సదుపాయం అందించేందుకు 8,450 కోట్ల రూపాయలతో 17 మెడికల్ కాలేజీ ల నిర్మాణాలను చేపట్టడం జరిగిందన్నారు. అయితే ప్రజల ఖర్మకాలి  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలలకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను ప్రైవేట్ పరం చేయడం జరిగిందని ఇది పేద ప్రజల పేద విద్యార్థులకు ద్రోహం చేసేటువంటి కార్యక్రమమని, దీనిని ఎట్టి పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సహించబోదని దీనిపై అలుపెరుగని పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని బలసింగాయపల్లి గ్రామంలో ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేట్ పరం చేయడానికి వ్యతిరేకంగా “రచ్చబండ” కార్యక్రమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకురాలు దాదిరెడ్డి భాగ్యమ్మ, సౌ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడం పై ఇప్పటికే పెద్ద ఎత్తున నియోజకవర్గ వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉదృతంగా కొనసాగించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ దుశ్చర్యపై ఇప్పటికే వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేయడం జరిగిందన్నారు. ఈనెల 23వ తేదీ కల్లా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పూర్తిచేసి వాటన్నిటిని కూడా గవర్నర్ కు అందజేసి ప్రజలకు కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను అక్రమాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎండగడతామని ఆయన కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ ఇ సి సభ్యులు కాశీభట్ల సత్య సాయి నాధ శర్మ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యశ్రీని అనారోగ్య శ్రీగా మార్చడం జరిగిందని గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యాన్ని అందించేందుకు ఆరోగ్యశ్రీ పథకాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఆయన స్వతహాగా డాక్టర్ కాబట్టి  పేద ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందన్నారు.  ఈ కార్యక్రమంలో ఎస్ ఇ సి సభ్యులు మాజీ టిటిడి బోర్డు మెంబర్ మాసీమ బాబు, కృష్ణారెడ్డి, జనార్దన్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, కరుణాకర్, జీయన్ భాస్కర్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, కొండపేట సర్పంచ్ తుంగ చంద్రశేఖర్ యాదవ్, ద్వారకనాథరెడ్డి, ఎంపీటీసీలు దుంప నాగిరెడ్డి, ఎర్ర సాని నిరంజన్ రెడ్డి, నాగినేని వెంకటరమణ, మాజీ ఎంపిటిసి భాస్కర్ రెడ్డి, నాగిరెడ్డి, మైనార్టీ నాయకులు అన్వర్ భాష, వారిష్, అబ్దుల్ రబ్, హస్రత్, వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author