మరణించిన వారు సైతం వైద్య విద్యార్థులకు పాఠాలు చెబుతారు..
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులచే “కేడావర్ ఒత్”…. చనిపోయిన మానవ శరీరాలను పరిశోధన చేయడం అన్నది వైద్య విద్యలో పునాది లాంటిదని ప్రతి వైద్య విద్యార్థి కేడావర్ ని గౌరవించాలని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ,కర్నూల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె . చిట్టి నరసమ్మ సూచించారు.సోమవారం కర్నూల్ మెడికల్ కాలేజీ యందు ఆనాటమీ డిపార్ట్మెంట్ యందు మొదటి సంవత్సరం విద్యార్థులచే కేడావరిక్ ఓత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ స్వచ్ఛందంగా తమ మృత శరీరాలను వైద్య కళాశాల అప్పగించినవారు, అనాధలుగా మరణించిన వారు వైద్య విద్యార్థులకు ప్రాక్టికల్స్ లో ఉపయోగపడుతున్నారని అందువలన మరణించిన మృత శరీరాలను గౌరవించడం, సమాజంలో పేద ప్రజల ఆరోగ్య సమస్యల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించడం ప్రతి వైద్య విద్యార్థి బాధ్యత అని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఆనాటమీ విభాగపు అధిపతి డా శోభ దేవీ, ప్రొఫెసర్ వాణీ శ్రీ, అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మొదటి సం. వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.

