అర్జీల పరిష్కారంలో అలసత్వం తగదు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే అర్జీల పరిష్కారంలో అలసత్వం తగదని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ సూచించారు. సోమవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో నిర్వహించిన పిజిఆర్ఎస్‌కి 23 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్‌జివి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, మేనేజర్ చిన్నరాముడు, ప్రజారోగ్య అధికారి నాగశివ ప్రసాద్, ఎంఈ మనోహర్, డిసిపి వెంకటరమణ, ఆర్‌ఓ జునైద్, కార్యదర్శి నాగరాజు, టిడ్కో అధికారులు పెంచలయ్య, మధు, సిఎంఎం భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

