NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి

1 min read

ఎమ్మిగనూరు కాంగ్రెస్ పార్టీ  కోఆర్డినేటర్ కాసిం వలి

ప్రజా  ఫిర్యాదుల  పరిష్కార వేదికలో తహసిల్దార్ చేసిన శేష ఫణి గారికి వినతి పత్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఎమ్మిగనూరు న్యూస్ నేడు:  ఎమ్మిగనూరు పట్టణంలో అకాల వర్షాలతో, నష్టపోయిన రైతాంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని, రైతులకు ప్రత్యేక నష్టపరిహారం ఎకరాకు 30 వేల రూపాయల అందించాలని, ఎమ్మిగనూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఖాసిం వలి డిమాండ్ చేశారు. సోమవారం ప్రజా సమస్యల ఫిర్యాదు వేదిక లో తాహసిల్దార్ శేష ఫనికి వినతిపత్రం ఇచ్చి మాట్లాడారు. రైతులు ఉల్లికి పత్తికి మరియు మిరపకు అన్ని రకాల పంటలకు మద్దతు ధర లేక అప్పుల పాలవుతున్నారని, చాలామంది పశ్చిమ ప్రాంతంలో వలసలు వెళ్తున్న అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని తెలిపారు. ముంతా తుఫాన్,తో కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో తీవ్ర నష్టం వాటిల్లిందని, రాష్ట్ర అధికారులు మరియు యంత్రాంగం తనిఖీలు నిర్వహించి రైతులకు నష్టపరిహారం అందజేసి న్యాయం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వలసలు ఆపడం పశ్చిమ ప్రాంతంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని, కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ప్రాజెక్టులు రైతులకు నష్టపరిహారం రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని తెలిపారు. రైతు పక్షాన రైతులకు అన్యాయం జరిగితే కూటమి ప్రభుత్వంపై పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో  విద్యార్థి విభాగం ఎన్ .ఎస్ .యుఐ జిల్లా అధ్యక్షుడు వీరేష్ యాదవ్, పార్టీ నాయకులు షబ్బీర్, ఆసిఫ్ లోకేష్, ఆన్సర్,అజయ్ తదితరులు పాల్గొన్నారు.

About Author