NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్వాతంత్ర్య పోరాట స్పూర్తిగీతం వందేమాతర గీతం

1 min read

150 వసంతాలు పూర్తయిన సందర్భంగా సర్ సి.ఆర్.రెడ్డి కాలేజీ విద్యార్థులతో భారీ ర్యాలీ

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: సర్ సి.ఆర్.రెడ్డి పి.జి.కళాశాల ఆధ్వర్యంలో నవంబర్ 7,1875న బంకిం చంద్ర ఛటర్జీ స్వరపరచిన స్వాతంత్ర్య పోరాట స్పూర్తిగీతం,ఉద్యమానికి మనోబలం తెచ్చిన శబ్ధ తరంగం అయిన వందేమాతరానికి 150 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా సోమవారం న సర్  సోమవారంసి.ఆర్.రెడ్డీ పి.జి. కళాశాల నుండి ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు పిజి కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్ధులతో భారీర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఏలూరు డి.ఎస్.పి. శ్రీ డి. శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ వందేమాతరానికి 150 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా భారత దేశం అంతటా ఎంతో ఘనంగా ఒక పండగ వాతావరణంగా జరుపుకోవడం చాలా అనందదాయకం అని, ఈ గీతం స్వాతంత్ర్యం రావటానికి ఒక శబ్ధ తరంగంగా ఉపయోగపడి ప్రతి భారతీయుడిలో పోరాట స్పూర్తిని, మనో బలాన్ని, మనో దైర్యాన్ని నింపిన గీతం అని, ఈ గీతాన్ని ప్రతీ వాడా, ప్రతీ పల్లె లో అందరికి వినిపించేదిగా పాడాలని దీనివలన యువతలో దేశ అభివృద్ధి పట్ల భాద్యత పెరుగుతుంది అని అభివర్ణించారు.  ఈ సందర్భంగా బంకిం చంద్ర ఛటర్జీ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ర్యాలీలో విద్యార్ధులు వందేమాతరం!, భారత మాతా కి జై! అనే నినాదాలతో పురవీధులలో మారు మ్రోగించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ శ్రీ కానాల శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ డా. కె.ఏ. రామరాజు, డైరెక్టర్ డా.వి ఆర్ ఎస్ బాబు యలమర్తి, కార్యక్రమ కో-ఆర్డినేటర్ డా.తేరా రాజేష్, వైస్ ప్రిన్సిపాల్ కె విశ్వేశ్వరరావు, యం ఉపేంద్ర, వివిధ విభాగాధిపతులు              ఏ. విజయ్ కుమార్, డా. ఆర్. శ్రీనివాసరావు, డా. జి. రాము, యం. రత్నాకర్, యం. రాజు పిజి లైబ్రెరీ సిబ్బంది జి రోజాకుమారి, కె కుసుమ కుమారి, అద్యాపకులు మరియు విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొని జయప్రదం చేశారు.

About Author