NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సామాజిక సేవా రంగంలో రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్న యు. నరసింహులు

1 min read

పత్తికొండ, న్యూస్​ నేడు:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి సామాజిక సేవా రంగంలో విశేష సేవలు అందిస్తున్న నవ యూత్ అసోసియేషన్ సీఈఓ యు. నరసింహులు రాష్ట్రస్థాయి సేవా అవార్డును అందుకున్నారు. హైదరాబాద్ హరిత హోటల్లో జరిగిన ముందడుగు న్యూస్ తెలుగు రాష్ట్రాల అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించారు.  విశ్రాంత ఐఏఎస్ అజయ్, ఐఏఎస్ వర్ర వెంకటేశ్వర్లు,  గాయని కౌసల్య గారి చేతుల మీదుగా యు నరసింహులు బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డును అందుకున్నారు.“గత 25 సంవత్సరాలుగా సమాజ సేవలో తాను చేస్తున్న కృషికి  అవార్డు లభించడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు.భవిష్యత్తులో ఇంకా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టి సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతాను” అని యు. నరసింహులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ముందడుగు న్యూస్ ఛానల్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి, మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

About Author