కడిమెట్ల, ఎర్రకోట గ్రామాలకు బడి బస్సు ని ఏర్పాటు చేయాలి
1 min read

నిత్యం పైచదువులు కోసం ఎమ్మిగనూరు కు వస్తున్న వందల మంది విద్యార్థులు
ఎమ్మిగనూరు న్యూస్ నేడు : ఎమ్మిగనూరు తహసీల్దార్ కి వినతి పత్రం ఇచ్చిన ఆర్ పి ఎస్ ఎఫ్ డివిజన్ అధ్యక్షులు విష్ణఎమ్మిగనూరు మండలంలో కడిమెట్ల, ఎర్రకోట గ్రామాలు నుంచి నిత్యం వందల మంది విద్యార్థులు పై చదువులు కోసం ఎమ్మిగనూరు కి వస్తున్నారు వాళ్ళ కోసం బడి బస్సు ని ఏర్పాటు చేయాలి అని ఆర్ పి ఎస్ ఎఫ్ డివిజన్ అధ్యక్షులు విష్ణు తహసీల్దార్ శేషఫణి గారికి వినతిపత్రం అందచేశారు.ఈ సందర్బంగా విష్ణు మాట్లాడుతూ కడిమెట్ల, ఎర్ర కోట గ్రామలు నుంచి నిత్యం వందల మంది విద్యార్థులు పై చదువులు కోసం ఎమ్మిగనూరు కి వస్తున్నారు కానీ బస్సు లు లేక విద్యార్థుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పాఠశాలకు మరియు కళాశాలనికి సమయానికి చేరుకోవడం లేదని దీనివల్ల వాళ్ళు తరగతులు మిస్ అవుతున్నారని అన్నారు. గతంలో ఈ విషయంపై డిపో అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని కావున తమారు ఇప్పటికి అయినా స్పందించి ఆ గ్రామాలుకు బడి బస్సు ఏర్పాటు చేయాలి అని వారు అన్నారు అనంతరం తహసీల్దార్ గారు సానుకూలంగా స్పందించి డిపో అధికారులు తో మాట్లాడి సమస్య ని పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు . ఈ కార్యక్రమం లో నాయకులు సుధాకర్, రంగస్వామి, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

