నిమోనియా పోస్టర్ ఆవిష్కరణ…
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: నవంబర్ 12వ తేది న జరుపుకునే ప్రపంచ నిమోనియా దినం సందర్భంగా ఈ రోజు జిల్లా కలెక్టర్ ఛాంబర్లో| జిల్లా కలెక్టర్ ఆద్వర్యం లో నిమోనియా పోస్టర్ ను ఆవిష్కరించారు. జాతీయ SAANS క్యంపైన్ కార్యక్రమం ఈనెల 12వ తేది నుంచి 28 వ తేది వరకు గ్రామ స్థాయి లో ఆశా, ANM’s, MLHP మరియు క్షేత్రస్థాయి సిబ్బంది కమ్మ్యునిటీలో నిమోనియా పై అవగాహన కల్పిస్తారు. 5 సం|| లోపు పిల్లల్లో నిమోనియా లక్షణాలు కలిగే ప్రమాదాలు, నివారణమార్గాలు, వ్యాదినిరోధక టీకాలు వేయడం, వాతావరణ కాలుష్యం, పొగ రహిత పొయ్యిలు వాడకం, సరైన గాలి, వెలుతురూ అందుబాటులో ఉండడం మొదలైన వాటి గురించి గృహ దర్శనాల్లో తెలియజేయడం జరుగుతుంది.ఈ కార్యక్రమం లో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. బాస్కర్ , జిల్లా ఇమ్మ్యునైజేషణ్ ఆఫీసర్ డా. ఉమా , DEMO శ్రీ ప్రకాష్ రాజ్ , HEEO బాబా ఫక్రుద్దీన్ , హెల్త్ సూపర్వైజర్, ప్రోజెక్షనిస్ట్ కలీల్ పాల్గొన్నారు.

