విద్యారంగానికి ఆజాద్ చేసిన సేవలు ఎనలేనివి.. మంత్రి టీజీ భరత్
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: విద్యారంగానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలు ఎనలేనివని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని 14వ వార్డు బుధవారపేటలోని చెట్టుకింద బడి వద్ద భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నిర్వహించిన క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడాలని విద్యార్థులను ఆయన కోరగా.. ఓ విద్యార్థిని ఆజాద్ గురించి మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన అభినందించి నగదు బహుమతి ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రను విద్యార్థులు తెలుసుకోవాలని ఆయన చెప్పారు. విద్యా వ్యవస్థలో వినూత్న సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అబుల్ కలాం ఆజాద్ అన్నారు. విద్యారంగానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివన్నారు. విద్యార్థులు తమకిష్టమైన రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు కష్టపడాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జకియా అక్సారి, విజయ కుమారి, బొందిలి కార్పొరేషన్ ఛైర్మన్ విక్రమ్ సింగ్, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ జేమ్స్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ ముంతాజ్, నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, సీనియర్ నాయకులు అబ్బాస్, రామాంజనేయులు, పోతురాజు రవికుమార్, తదితర నాయకులు, బూత్ ఇంచార్జీలు పాల్గొన్నారు.

