బెల్ట్ షాపులకు రెక్కలు..
1 min read

మహానంది, న్యూస్ నేడు: బెల్ట్ షాపులకు రెక్కలు మళ్లీ వచ్చినట్లు విశ్వాసనీయ సమాచారం. మండలంలోని వివిధ గ్రామాల్లో బెల్ట్ షాపులు తిరిగి ప్రారంభమైనట్లు తెలుస్తుంది. మండలంలో ఉన్నటువంటి వివిధ మద్యం దుకాణాల నుండి బెల్టులకు మద్యం చేరుతున్నట్లు సమాచారం. వివిధ గ్రామాల్లోని నాయకులు కొందరు మద్యం దుకాణాల్లో భాగస్వాములు కావడంతో మరల బెల్టుల షాపుల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రభుత్వం బెల్ట్ షాప్ లపై ఒకవైపు ఉక్కు పాదం మోపుతుండడంతో తాత్కాలికంగా కొన్ని రోజులపాటు బెల్ట్ షాపులు మూతపడ్డాయి. మద్యం దుకాణాల్లో భాగస్వాములైన గ్రామాల్లోని కొందరు నాయకుల జోక్యంతో తిరిగి బెల్టు షాపులు పునః ప్రారంభం అయినట్లు విమర్శలు వినవస్తున్నాయి.

