నందికొట్కూరు,చౌట్కూరు,49 బన్నూరు’లో పొలంబడి..
1 min read

పద్ధతులు పాటిస్తే అధికంగా పంట దిగుబడి
ఏడిఏ గిరీష్,ఎంఏఓ లు షేక్షావలి,పీరు నాయక్..
నందికొట్కూరు, న్యూస్ నేడు: వ్యవసాయ పంటల్లో పద్ధతులు పాటిస్తే పంట దిగుబడి అధికంగా వస్తుందని నందికొట్కూరు వ్యవసాయ సహాయ సంచాలకులు గిరీష్ రైతులతో అన్నారు.బుధవారం నంద్యాల జిల్లానందికొట్కూరు పట్టణంలోఎంఏఓ షేక్షావలి పొలాలకు వెళ్లి పొలాల పంటల అధిక దిగుబడి గురించి వాటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారు రైతులకు అవగాహన కల్పించారు.సుస్థిర మరియు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరించి వ్యవసాయం చేసినట్లయితే ఆరోగ్యమైన పంటతోపాటు మంచి దిగుబడి పొందటానికి అవకాశం ఉంటుందని సూచించారు.రైతులు ఎక్కువగా విచక్షణ రహితంగా ఎరువులను మరియు పురుగు మందులను వాడడం వల్ల పంటల్లో అవశేషాలు ఎక్కువై జంతు జీవజాతులకు హాని కలిగిస్తున్నాయని వాటిని తగ్గించి సేంద్రియ వ్యవసాయం చేయాలని రైతులకు సూచించారు.మిడుతూరు మండలంలోని 49 బన్నూరు, చౌటుకూరు గ్రామాల్లో ఎంఏఓపీరు నాయక్ పొలాలకు వెళ్లి రబీ సీజన్ లో వేసే విత్తనాలు సర్టిఫైడ్ అయిన షాపుల్లోనే విత్తనాలు కొని వాటి రసీదును తప్పనిసరిగా తీసుకోవాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పుల్లారెడ్డి, రమణారెడ్డి,ఏఈఓ లు అశోక్, మల్లికార్జున రెడ్డి,ఆర్ఎస్ కే సిబ్బంది మహేష్, సుధాకర్ మరియు రైతులు పాల్గొన్నారు.


