కొండపేట పెన్నా నదిలో బయటపడ్డ విష్ణుమూర్తి…
1 min read

వెంకటేశ్వర స్వామి పోలిన రాతి విగ్రహం
న్యూస్ నేడు చెన్నూరు : చెన్నూరు మండలం చెన్నూరు- కొండపేట పెన్నా నది వంతెన సమీపంలో కొండపేట వద్ద పెన్నా నదిలో నీరు తగ్గిపోవడంతో పురాతన విష్ణుమూర్తి. వెంకటేశ్వర స్వామి పోలిన రాతి విగ్రహము ఇటీవల బయటపడింది. విగ్రహాన్ని చూసేందుకు కొండపేట చెన్నూరు ప్రాంతాల నుంచి ప్రజలు వెళ్లి విగ్రహాన్ని చూస్తున్నారు. ఇటీవల పెన్నా నదికి పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహించిన విషయం తెలిసిందే. పెన్నా నది ఉధృతికి ఎగువ భాగం నుంచి నీటి ప్రవాహానికి కొట్టుకోవచింటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పుష్పగిరి పరిసర ప్రాంతాల్లో ఈ విగ్రహం నదిలో ఉండి ఉంటుందని పలువురు అంటున్నారు. కుందూ నది. పాపాగ్ని నదులు కూడా ఈసారి ఉధృతంగా ప్రవహించాయి. పెన్నా నదిలో చాలావరకు ఇసుక తరలించకపోవడం వలన రాళ్లు ఉండ్రు మట్టి బయటపడుతుంది. పెన్నా నదిలో ఏదో ఒకచోట ఈ విగ్రహం ఉండి ఉంటుందని పెన్నా నది ప్రవాహానికి కొండపేట వద్ద పెన్నా నది ఒడ్డుకు చేరి ఉంటుందని పలువురు పరిశీలకులు భావిస్తున్నారు. ఈ విగ్రహాన్ని పురావస్తు శాఖ. ఎండోమెంట్ అధికారులు తేల్చవలసి ఉంది.

