కొల్లేరు అభయారణ్యం సరిహద్దులను గుర్తించి నివేదిక సమర్పించాలి
1 min read

రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ డా:పి.వి చలపతిరావు
గోదావరి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె.వెట్రీ సెల్వి అధ్యక్షతన కార్యక్రమం
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: కొల్లేరు అభయారణ్యం సరిహద్దులను గుర్తించి నివేదిక సమర్పించాలని రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ ప్రిన్సిఫుల్ కన్జర్వేటర్ డా:పి.వి.చలపతిరావు అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపుహాలులో రాష్ట్ర అటవీశాఖ అదనపు ప్రిన్సిపుల్ చీఫ్ కన్జర్వేటర్ శాంతిప్రియ పాండే,జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల అటవీ, రెవిన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులతో కొల్లేరు అభయారణ్యం,సుప్రీం కోర్ట్ ఏర్పాటుచేసిన కేంద్ర సాధికార కమిటీ కొల్లేరు అభయారణ్యం లో కొన్ని అంశాలపై నివేదికలు కోరిన అంశాలపై అధికారులతో డా. చలపతిరావు సమీక్షించారు. ఈ సందర్భంగా డా. చలపతిరావు మాట్లాడుతూ కొల్లేరు అభయారణ్యం సరిహద్దులను అభయారణ్యం రూపొందించినప్పుడు ఉన్న రికార్డులతో ప్రస్తుతం ఆధునిక లిడార్ సర్వే టెక్నాలజీ ద్వారా గుర్తించి నివేదికలు సమర్పించాలన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి , జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా అటవీ శాఖాధికారి బి. విజయ, ఏలూరు జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు,ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ శేషుబాబు,ఎస్ఈ దేవప్రకాష్, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, పంచాయతీరాజ్ ఎస్ఈ రమేష్, డిపిఓ కె. అనురాధ, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ త్రినాధ్ బాబు, అటవీ,రెవిన్యూ, ఇరిగేషన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


