భక్తుల సౌకర్యార్థం..బోర్ వేయించిన ఎంపీ శబరి
1 min read

మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి..
నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని ఆత్మకూరు రహదారిలో ఉన్న జమ్మి చెట్టు వద్ధ భక్తుల సౌకర్యార్థం మరియు పట్టణ ప్రజల కొరకు గాను నంద్యాల ఎంపీ మరియు పార్లమెంట్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి శనివారం త్రాగునీటి బోర్ వేయించినట్లు నందికొట్కూరు మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు మరియు కేజీ రోడ్డు వెళ్లే ప్రయాణికులకు అవసర నిమిత్తం కొరుకు పవర్ బోర్ పనులు చేయించడం జరిగిందని అదేవిధంగా గతంలో జమ్మిచెట్టు వద్ద ప్రజలు నీటి కొరకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ దృష్టికి రావడంతో బోర్ వేయిస్తానని ఎంపీ మాట ఇచ్చారని అందులో భాగంగానే శనివారం 2 లక్షల 70 వేల ఎంపీ నిధుల కింద బోర్ వేయించినట్లు మున్సిపాలిటీ చైర్మన్ తెలిపారు.ముందుగా సుధాకర్ రెడ్డి చేతులు మీదగా టెంకాయ కొట్టి బోర్ ను ప్రారంభించారు.పట్టణ ఉత్సవ సమితి సభ్యులు,ప్రజలు ఎంపీకి, మున్సిపాలిటీ చైర్మన్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీటెక్ రాజు, శ్రీధర్,వెంకటేష్,శేఖర్,భాను ప్రకాష్,నాగరాజు,రేవంత్, పాల్గొన్నారు.

