NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సతీష్ కుమార్ పార్తివదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

1 min read

పత్తికొండ, న్యూస్​ నేడు: దారుణ హత్యకు గురైన  టీటీడీ మాజీ ఏ ఎస్ ఓ సతీష్ కుమార్  పార్తివదేహానికి పత్తికొండ నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ.కే.ఈ.శ్యామ్ కుమార్  పూలమాల వేసి నివాళి అర్పించారు. పత్తికొండ ఒడి లో పుట్టి పెరిగిన ఒక నిజాయితీ గల పోలీసు అధికారిని కోల్పోయిందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అన్నారు . సతీష్ మరణించిన తీరు  వీడియోను చూస్తే  అది ఆత్మహత్య లేక హత్యా అని తెలిసిపోతుందనీ అన్నారు ఎలాంటి విచారణ జరగలేదు. వైయస్సార్సీపి అధికారిక ఫేస్ బుక్  ద్వారా సతీష్ ది ఆత్మహత్య అని తేల్చి చెప్పడం వారి హత్యా రాజకీయాలను తేటతల్లించస్తుందని తెలిపారు. చావును రాజకీయంగా చేయడం మీకే చెల్లు, మరి ఇంతలా దిగజారుడు రాజకీయాలకు దిగడం సిగ్గుచేటు అన్నారు. పేదరికంలో పుట్టి, కష్టపడి చదివి ఒక మంచి పోలీస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న సతీష్ కుమార్ ను పరకామణి చోరీ కేసులో సి బి సి ఐ డి ముందు తన స్టేట్మెంట్ ఇస్తే వైసిపి పెద్ద నాయకుల పేర్లు బయటికి వస్తాయని విచారణకు వెళ్తున్న సతీష్ కుమార్ ను దారుణంగా హత్య చేశారన్నారు. ఒక్కసారి రాష్ట్ర ప్రజలు,పత్తికొండ నియోజకవర్గం ప్రజలు ఆలోచించండి. మనం ఏ పార్టీకి మద్దతిస్తున్నాము నీతి నిజాయితీగల పార్టీ ఏదో ఏ పార్టీ ద్వారా అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇటు పత్తికొండ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందో ఆలోచించండి. వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయి వివేకానంద రెడ్డిని గొడ్డలిపోటుతో చంపి గుండెపోటు అని చెప్పిన మాటలు అలాగే పెత్తందారి వ్యవస్థకు ఎదురొడ్డి , బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడిన పరిటాల రవి ని చంపిన హత్య కేసులో ముద్దాయిలు ఏ విధంగా ఒకరి తర్వాత ఒకరు దారుణ హత్యలకు గురికావడం ఒక్కసారి ప్రజలు గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.

About Author