నేడు వైసీపీ రిలే నిరాహార దీక్షలు ప్రారంభం..
1 min read

మొక్కజొన్న,ఉల్లి రైతులను ఆదుకోవాలి
రైతులకు మద్దతుగా దీక్షలు..
నందికొట్కూరు, న్యూస్ నేడు: మొక్కజొన్న,ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఈరోజు ఆదివారం ఉదయం పది గంటలకు పటేల్ సెంటర్ లో రిలే నిరాహార దీక్షలను ప్రారంభిస్తున్నట్లు పగిడ్యాల వైసీపీ మండల కన్వీనర్ పుల్యాల నాగిరెడ్డి,మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తువ్వా చిన్న మల్లారెడ్డి,రమేష్ నాయుడు అన్నారు. పట్టణంలోని డాక్టర్ సుదీర్ స్వగృహంలో శనివారం సాయంత్రం పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూమొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కర్నూలు జిల్లాలో రైతులకు నష్టపరిహారం ఇస్తుంటే,నంద్యాల జిల్లా రైతులను మాత్రం ఏ ఒక్క అధికారి కానీ పట్టించుకోవడం లేదంటే నంద్యాల జిల్లా రైతులు అంటే అంత చిన్న చూపా అని ప్రశ్నించారు.మా ప్రభుత్వంలో 54.55 లక్షల రైతులకు తోడుగా నిలబడుతూ రూ.7,802 కోట్లతో ఉచిత పంటల బీమా పరిహారం ఇప్పించాం.ప్రతి ఎకరాకు ఈ–క్రాప్ చేసి, అప్పుడు ప్రభుత్వమే బీమా ప్రీమియమ్ కట్టింది రైతులపై ఎలాంటి భారం వేయలేదన్నారు.కానీ ఈ ప్రభుత్వంలో రైతులను గాలికి వదిలేశారు.మొక్కజొన్న,ఉల్లి, పొగాకు కొనుగోలు చేయాలని ఈ కూటమి ప్రభుత్వం ఒక రైతుకు మేలు చేయలేదని విమర్శించారు.ఈరోజు చేపట్టే దీక్షలను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మన్సుర్ అహ్మద్,నాగభూషణం రెడ్డి,మల్లేశ్వర రెడ్డి,జబ్బార్,కృష్ణారెడ్డి,లోకేశ్వరరెడ్డి,తులసిరెడ్డి,బాబు,సర్పంచ్ నాగార్జున రెడ్డి,కాటం వెంకటరమణ,నాగ శేనారెడ్డి పాల్గొన్నారు.


