NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు జిల్లాలో అటవీ–రెవెన్యూ భూములపై విస్తృత అక్రమ కబ్జాలు

1 min read

రాయలసీమ ఉద్యమ యువ నాయకులు సీమ కృష్ణ రాథోడ్

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు జిల్లా వ్యాప్తంగా అటవీ శాఖ,రెవెన్యూ శాఖ అధికార పరిధిలోని భూములపై అక్రమ కబ్జాలు పాల్పడుతున్నారని జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజా గ్రీవెన్స్ లో రాయలసీమ ఉద్యమ యువ నాయకులు,కర్నూల్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేశారు.ఈ సందర్భంగా సీమ కృష్ణ రాథోడ్ మాట్లాడుతూ కోట్ల రూపాయల విలువైన వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోవడం,సాగుభూములుగా మార్చడం వంటివి చేస్తున్నారని,సంబంధిత శాఖలు తగిన చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేయడం విమర్శలకు దారి తీస్తోందన్నారు.కర్నూలు అటవీ డివిజన్ పరిధిలో మొత్తం 364 హెక్టార్ల అటవీ భూమి ఆక్రమణకు గురైందని ఇందులో 80.48 హెక్టార్లను మాత్రమే తిరిగి స్వాధీనం చేసుకోగా,మిగిలిన 283.52 హెక్టార్లు ఇంకా అక్రమదారుల చేతిలోనే ఉందన్నారు.ఆదోనీ రెవెన్యూ డివిజన్‌లో 168.66 హెక్టార్ల అటవీ భూమి ఆక్రమణలోకి వెళ్లిందని,పత్తికొండలో 12.63 హెక్టార్లు కృష్ణగిరిలో 20.08 హెక్టార్ల అటవీ భూమి ఇప్పటికీ అక్రమ కబ్జాల్లోనే ఉందని కర్నూలు శివారులోని దిన్నెదేవరపాడు అటవీభూమి మొత్తం 87 ఎకరాలు.భూమికి రెండు వైపుల మాత్రమే ప్రహరీ ఉండగా,ఇంకా 1.58 కి.మీ ప్రహరీ నిర్మాణం పెండింగ్‌లో ఉందన్నారు.ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ ఇసుక నిల్వలు రవాణాదారులు అక్రమ తరలింపులు కొనసాగిస్తున్నారని అన్నారు.హాళ్వహారి మండలం గూళ్యం గ్రామంలోని అటవీ భూములకు రెవెన్యూ అధికారులు అనధికారంగా పట్టాలు జారీ చేసినట్టు బయటపడిందన్నారు. అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.అటవీశాఖ అధికారులు పట్టాలను చూపించాలని కోరినా స్పందన రాకపోవడం విమర్శలకు దారి తీస్తోందన్నారు.ఈ పట్టాలను అత్యవసరంగా పరిశీలించి రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ ,భూషణ్ పాల్గొన్నారు.

About Author