NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పోస్టల్ ఇన్సూరెన్స్ తో కుటుంబానికి భరోసా

1 min read

మహానంది, న్యూస్​ నేడు:  పోస్టల్ ఇన్సూరెన్స్ తో కుటుంబానికి భరోసా అని పోస్టల్ శాఖ నంద్యాల సబ్ డివిజన్ ఏ ఎస్ పి సత్యనారాయణ అన్నారు. సోమవారం మహానంది మండల పరిధిలోని గోపవరం గ్రామానికి చెందిన కిషోర్ కుమార్ అనే వ్యక్తి ఇటీవల పోస్టల్ శాఖ ప్రవేశపెట్టిన లైఫ్ ఇన్సూరెన్స్ ను స్థానిక పోస్టాఫీ స్ లో పొందాడు.నెల నెలా 17 వందల రూపాయల ప్రకారం కొన్ని నెలలు చెల్లించాడు. గత కొద్దిరోజుల క్రితం గుండె పోటు రావడంతో మృతి చెందాడు. ఇంటికి పెద్దదిక్కు కోల్పోవడంతో ఇన్సూరెన్స్ ఎంతగానో ఆసరాగా నిలిచింది. నామిని అయిన మృతుని భార్య శోభారాణి కి 5 లక్షల25వేళా992 రూపాయల చెక్కు ను పోస్టల్ శాఖ అధికారులు అందించారు. ఈకార్యక్రమంలో పోస్ట్ మాస్టర్ శ్రీనివాసులు,ఎం ఓ నరసింహ,ఏ బి పి ఎం సిమ్రాన్, బి పి ఎం కాశింబి,తదితరులు పాల్గొన్నారు.

About Author