కేంద్ర మంత్రికి ఆత్మీయ స్వాగతం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు : కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా కర్నూలు ఎయిర్పోర్ట్ కి విచ్చేసిన కేంద్ర విద్యుత్ మరియు గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ కి ప్రజా ప్రతినిధులు ఆత్మీయ స్వాగతం పలికారు.జిల్లా పర్యటనలో భాగంగా కర్నూలు ఎయిర్పోర్ట్ కి విచ్చేసిన కేంద్ర విద్యుత్ మరియు గృహ & పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ కి, కేంద్ర విద్యుత్ మరియు రెన్యువబుల్ ఎనర్జీ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యశో నాయక్ కి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ లు కర్నూలు ఎయిర్ పోర్టులో తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.
కేంద్ర మంత్రికి ఆత్మీయ వీడ్కోలు
గ్రీన్ కో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ సైట్ లో మినిస్ట్రీ ఆఫ్ పవర్ కి సంబంధించిన పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం కర్నూలు జిల్లా పర్యటనను ముగించుకొని కర్నూలు ఎయిర్పోర్ట్ కి విచ్చేసిన కేంద్ర విద్యుత్ మరియు గృహ & పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ కి ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికారు.

