తిమ్మాపురం’లో వివాహిత ఆత్మహత్య..
1 min read

మృతురాలికి 14 నెలల పాప..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలో తిమ్మాపురం గ్రామంలో వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు మిడుతూరు ఎస్ఐ హెచ్ ఓబులేష్ తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన షేక్ కరిష్మా(20) గురువారం ఉ 7:50 ని.కు వారి ఇంటిలో గవాసికి చీరతో ఉరి వేసుకుంది.భర్తమొల్ల షఫీ ఉల్లా సీసీ కెమెరాల మెకానిక్ గా పని చేస్తున్నాడు. పని నిమిత్తం భర్త సున్నిపెంటకు వెళ్ళాడు. కరిష్మా డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతోంది.డిగ్రీ పరీక్షలు ఉన్నాయి హాల్ టికెట్ తీసుకోవాలి నువ్వు రావాలని భార్య భర్తకు ఫోన్ చేసింది. రేపు వస్తానని భర్త చెప్పడంతో భార్య ఆత్మహత్య చేసుకున్నట్లు మిడుతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చేలోపు మరణించినట్లు ఎస్సై తెలిపారు.వీరికి 14 నెలల పాప ఉంది.కరిష్మా స్వగ్రామం గడివేముల మండలం బూజునూరు గ్రామం.మూడు సంవత్సరాల క్రితం వివాహం అయిందని మృతురాలు తల్లి రమిజాబి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.

