NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పల్లెల్లో  బెల్ట్ షాపులస్పీడు – మందుబాబులకు కిక్కు జోరు

1 min read

మామూళ్ల మత్తులో అధికారులు -వసూళ్లు తప్ప పరిశీలనకు నోచుకోని వ్యవస్థ.

రోడ్డున పడుతున్న కుటుంబాలు

చెన్నూరు ,న్యూస్ నేడు: పల్లెల్లో పరుగులు తీస్తున్న బెట్టుషాపులు ఫుల్లుగా ఎక్కుతున్న కిక్కు వీధిన  పడుతున్న కుటుంబాలు , రాష్ట్ర ప్రభుత్వం బెల్టు షాపులపై ఉక్కు పాదం మోపుతాం అని ఒక వైపు చెబుతున్న మేము మాత్రం ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోం అన్నట్టుగా తయారైంది సంబంధిత శాఖ అధికార యంత్రాంగం చెన్నూరు మండలం లోని అన్ని గ్రామాలలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం ఏరులై పారుతుంది ప్రభుత్వం మద్యం షాపులు గ్రామాలకు, పాఠశాలలకు, ప్రభుత్వ కార్యాలయాలకు దూరంగా ఉండాలని నిబంధనలను జారీ వ్యాప్తంగా రెండు లేక మూడు మద్యం దుకాణాలకు పర్మిషన్ ఇస్తే కొంతమంది అక్రమార్కులు గ్రామాలలో ఎక్కడపడితే అక్కడ బెల్ట్ షాపులు పెట్టి ప అధిక ధరలకు  మందు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా బెల్టు షాపులు ఇండ్ల ఆవాసాల మధ్యలో విక్రయిస్తుండడంతో అక్కడి గ్రామ ప్రజలు ఒకింత అసహనానికి గురవడమే కాకుండా ఇప్పుడు ఏ సమస్య వస్తుందోనని భయందోలనలో బెంబేలెత్తిపోతున్నారు. దీనిపైన కొందరు మహిళలు పోలీసులకు సమాచారం ఇచ్చిన వారు వచ్చి బెల్టు షాపుల యజమానుల దగ్గర డబ్బులు దండుకోవడమే కాకుండా సమాచారం ఇచ్చిన వారి పేర్లను కూడా అవతలి వారికి చేరవేయడంతో  గొడవలు కూడా జరుగుతున్నాయి. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చే ధైర్యం కూడా ప్రజలు చేయడం లేదు, ప్రభుత్వం మద్యం దుకాణాల వద్ద మందుబాబులకు ప్రశాం తంగా తాగేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కానీ పల్లెల్లో మద్యం ప్రియులకు ఎలా ఎక్కుతుందబ్బా కిక్కు అనుకున్నారో ఏమో బైకుల ద్వారా, ఆటోల ద్వారా, కొందరు కార్ల ద్వారా కొన్ని స్కూటిల ద్వారా రవాణా చేస్తూ  బెల్ట్ షాపుల ద్వారా అంగట్లో సరుకుల్లా అధిక ధరలకు అమ్ముతుండడంతో కిక్కు పల్లెల్లో ఎక్కువైంది అంటున్నారు కొంతమంది ప్రజలు. మండల ప్రజలు తెల్లారి ఆరు గంటలకు కూలీనాలీ చేసుకుని జీవనం సాగిస్తున్న వీరి జీవనశైలిని కొంతమంది పసిగట్టి వారు మండల పరిధిలోని మద్యం దుకాణాలకు పోకుండా బెల్ట్ షాపుల ద్వారా ఎక్కువ ధరకు గ్రామాలలోని విక్రయించడం జరుగుతుంది. ఉదయం కూలికి పోయి సంపాదించిన డబ్బులు గ్రామాలలోని విచ్చలవిడిగా బెల్ట్ షాపుల ద్వారా విక్రయిస్తున్న మద్యం అధిక ధరలకు మద్యం ప్రియులు కొనుగోలు చేసుకోవడం జరుగుతున్నది. వీరి వలన బెల్టు షాపులకు భలే గిరాకీగా మారిందని అక్కడి ప్రజలు గుసగుసలాడుకోవడం జరుగుతున్నది. మరికొంత మంది కూలి పనులు ఎక్కడ చేసుకుంటున్నారో. అక్కడికే మందు సప్లై చేయడం కూడా జరుగుతున్న దంటా.. రాత్రి 10 గంటలకు మూసివేసిన మద్యం షాపులు తెల్లవారి 10 గంటలకు తిరిగి తెరవాలి. కానీ పల్లెలో 24 గంటలు మద్యం బాటిళ్లు ఇచ్చేందుకు అందుబాటులో బెల్ట్ షాపులు రెడీగా బార్ల తెరిచి కనపడుతున్నాయి. ఈ బెల్టు షాపుల వ్యవహారం ఇలాగే కొనసాగితే టెండర్ల ద్వారా లక్షల కు లక్షలు పోసి తెచ్చు కున్న మద్యం దుకాణదారులు పలు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. బెల్టు షాపుల ద్వారా కల్తీ మద్యం కూడా చెన్నూరు మండలంలో సరఫరా అవుతుందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. అది ఎక్కడికి వస్తుంది ఎలా వెళుతుంది అరా తీయాల్సిన మద్యం సంబంధిత శాఖ ఎవరి వాటా వారిదే నన్న విధంగా సాగుతుందన్నట్లు మందుబాబులే కిక్కెక్కినప్పుడల్లా మాట్లాడుకుంటున్నారు.వీటన్నింటి దృష్ట్యా ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చేందుకు బెల్ట్ షాపులపై పరిశీలన గావించి, బెల్ట్ షాపులపై విజిలెన్స్ అధికారులు తమదైన శైలిలో బెల్ట్ షాపు పై తనిఖీలు చేపట్టి అక్రమార్కుల భరతం పట్టాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.

About Author