పుట్టినరోజు రక్తదానం చేయండి”…
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: సురేష్ కుమార్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జనవిజ్ఞాన వేదిక ఆంధ్ర ప్రదేశ్. మీ పుట్టినరోజుకు పెళ్లిరోజు మీ పిల్లల పుట్టిన రోజుకు రక్తదానం చేయడం ఒక మంచి అలవాటని దీన్ని మీరు పాటిస్తూ మీ పిల్లలకు కూడా అలవాటు చేస్తే ఒక మంచి సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన వాళ్ళు అవుతారని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బి సురేష్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం తన కుమారుని పుట్టినరోజు సందర్భంగా తాను రక్తదానం చేస్తూ తన కుమారుడితో కూడా రక్తదానం చేయించడం జరిగింది. పిల్లలకు కూడా రక్తదానం అలవాటు చేస్తే ఒక మంచి సమాజానికి పనికొచ్చే పిల్లలుగా తయారవుతారని మంచి అలవాట్లలో పయనించే అవకాశం ఉందని , భద్రత తల్లిదండ్రులు తమ పుట్టినరోజుకు పెళ్లిరోజుకు రక్తదానం చేయడం ప్రారంభించారని తమ పిల్లలకు కూడా అలవాటు చేస్తే మంచి పని చేసిన వారవుతారని ఆయన కోరారు.

