హోస్పెట్ చింతామణి మఠం పీఠాధిపతుల కు పూర్ణకుంభంతో స్వాగతం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: జయ గురుదత్త శ్రీ గురుదత్త మన కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయమును హోస్పెట్ చింతామణి మఠం పీఠాధిపతులు పూజ్యశ్రీ శ్రీ శ్రీ శివానంద భారతి స్వామిజీ వారు సందర్శించినారు. శ్రీ స్వామిజీ వారికి ఆలయ మర్యాదలతో ఆలయ అర్చకులు మరియు ట్రస్ట్ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికినారు. అనంతరం శ్రీ స్వామిజీ వారు ఆలయములోని దేవీ దేవతలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించినారు. అనంతరం భక్తులను ఆశీర్వదించి. శ్రీ స్వామిజీ వారు దేవాలయం గురించి మాట్లాడుతూ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి స్వహస్తములతో ప్రతిష్టించిన క్షేత్రము ఇది ఈ దేవాలయము గొప్ప క్షేత్రంగ అవుతుంది అని స్వామిజీ వారు చెప్పినారు శ్రీ శ్రీ శివానంద భారతి స్వామిజీ వారు ఆనందం వెక్తం చేసినారు. అనంతరం ఆలయ ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్ టి.శివ రామకృష్ణ శ్రీ స్వామిజీ వారికి ఫల, పుష్పమాలికలను సమర్పించారు. ఈ కార్యక్రమములో ట్రస్ట్ సభ్యులు కృష్ణమూర్తి ప్రసాద్ మరియూ మాతృమండలి సభ్యులు మరియూ భక్తులు పాల్గొని శ్రీ స్వామిజీ వారి ఆశీర్వాదం అందుకున్నారు.


