కేసీ కెనాల్ బ్రిడ్జి కింద గుర్తుతెలియని మహిళ మృతదేహం
1 min read
న్యూస్ నేడు, చెన్నూరు : చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇర్కాన్ సర్కిల్ వద్ద గల కేసీ కెనాల్ బ్రిడ్జి కింద గురువారం ఉదయం 10 గంటల సమయంలో గుర్తు తెలియని 35 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళ మృతదేహాన్ని కనుగొన్నట్లు సీఐ కృష్ణారెడ్డి తెలిపారు, మహిళ మృతదేహం పై ఎలాంటి దుస్తులు లేవని. అలంఖాన్ పల్లి వీఆర్వో సుబ్బరాయుడు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. సదరు మహిళ సుమారు 3 వారాల క్రితం చనిపోయి ఉన్నట్లు కనపడుతుందని, శరీరం పై ఎలాంటి గాయాలు లేవని ఒంటి పై ఒక ముక్కు పడక, రెండు చేతులకు ఎర్రటి రంగు మట్టి గాజులు, రెండు కాళ్లకు వెండి పట్టీలు ఉన్నాయని కాగా ఈ సంఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


