NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రిలే నిరాహార దీక్షకు  మద్దతు తెలిపిన ఎమ్మెల్యే

1 min read

ఆలూరు న్యూస్ నేడు: ఆదోనిలో  భీమాస్ సర్కిల్ నందు  ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని రిలే నిరాహార దీక్షకు  మద్దతు తెలిపిన ఆలూరు వైయస్సార్సిపి ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  ఆలూరు వైయస్సార్సిపి ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి   మాట్లాడుతూ… ఎమ్మిగనూరు,  మంత్రాలయం, పత్తికొండ, ఆదోని,ఆలూరు నియోజకవర్గలకు మధ్యలో ఆదోని ఉంది కాబట్టి ఆదోని జిల్లాగా చేస్తే  4 నియోజకవర్గ ప్రజలకు  ఎంతో ఉపయోగపడుతుందన్నారు .ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలానికి కర్నూల్ జిల్లా చాలా దూరం అవుతుంది, ఆదోని జిల్లా అయితే చాలా దగ్గరవుతుంది అన్నారు.ఆదోని జిల్లా అయితే ఆదోని పక్కన ఉన్న నియోజకవర్గలని అభివృద్ధి చెందుతాయి అన్నారు.ఆదోని జిల్లా అయితే జిల్లా కలెక్టర్ కార్యాలయం మరియు  ఎస్పీ కార్యాలయం వస్తుంది, పార్టీలకతీతంగా అందరూ పోరాడుతే బాగుంటుందని అన్నారు.ఇక్కడ  నిరాహార దీక్ష చేస్తున్న  వారికి నేను ఎల్లప్పుడు సపోర్టుగా ఉంటానని, ధర్నా చేయడానికి కూడా వస్తానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు,జిల్లా ఉపాధ్యక్షులు,తాలూకా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు,వైస్ ఎంపీపీ లు ఎంపీటీసీ లు, కో కన్వీనర్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్​ అభిమానులు పాల్గొన్నారు.

About Author