వైయస్సార్సీపి జిల్లా రైతు విభాగం జనరల్ సెక్రటరీగా ద్వారక నాథ రెడ్డి
1 min read

చెన్నూరు , న్యూస్ నేడు: వైఎస్ఆర్సిపి జిల్లా రైతు విభాగం జనరల్ సెక్రటరీగా చెన్నూరు మండలానికి చెందిన ద్వారకనాథరెడ్డి నియమితులయ్యారు. ఈ ఎంపికను మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ధ్రువపరిచినట్లు ద్వారకనాథరెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన శనివారం చెన్నూరులో విలేకరులతో మాట్లాడుతూ, వైయస్సార్ సిపి పార్టీ ఆవిర్భావం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన అన్ని కార్యక్రమాలలో తమ వంతు కృషి చేయడం జరిగిందని పార్టీ ఆదేశానుసారం జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జి పోచం రెడ్డి నరేన్ రామాంజులరెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్దేశించిన రైతులకు సంబంధించిన రైతు సమస్యలన్నీటిపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతు సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా కురుస్తున్న వర్షాల వల్ల కుదేళ్లు అయిన రైతులను ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని అలాగే రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉందని ఆయన అన్నారు. తన నియామకానికి సహకరించిన వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డికి, మాజీ మంత్రి అంజద్ భాషాకు, మాజీ మేయర్ సురేష్ బాబుకు, కమలాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జి నరేన్ రామాంజులరెడ్డికి, టిటిడి బోర్డు మాజీ మెంబర్ మాసినమ బాబుకు, వైయస్సార్సీపి మండల అధ్యక్షులు జీయన్ భాస్కర్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

