జిల్లాలో మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు
1 min read

జిల్లాలో మత్స్యసంపద పెంచి మత్స్యకారుల జీవితాలలో వెలుగులు
మత్స్యకారుల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి చర్యలు
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు : జిల్లాలోని మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేకతలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు.శుక్రవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్ నందు జిల్లా మత్స్యశాఖ వారి ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యశాఖ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ…. జిల్లాలో ఉన్న మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందన్నారు.నంద్యాల వ్యవసాయ అనుబంద శాఖలపైన ఆధారపడిన జిల్లా మన జిల్లాలో ఎక్కువగా హార్టికల్చర్, లైవ్ స్టాకు, అగ్రికల్చర్ తర్వాత ఆక్వారంగం ద్వారా జిల్లాకు జిడిపి ఎక్కువగా వస్తుందన్నారు. జిల్లాలో 65వేల మెట్రిక్ టన్నులు చాపల ఉత్పత్తి ఉందన్నారు. ఈ ఏడాది 80 వేల మెట్రిక్ టన్నులకు పెంచాలన్న ఆలోచనతో జిల్లా యంత్రాంగం ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. జిల్లాలో 330 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు ఉన్నాయని కానీ 110 ట్యాంకులలోనే చేపల పెంపకం జరుగుతోందని చేపల పెంపకం రిజర్వాయర్లు చెరువుల ద్వారా పెంచితే మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి పెరిగి జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ దిశగా చెరువులలో మరింత చేపల పెంపకం చేపట్టేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు .మనుషుల్లో తెలివితేటలు, పిల్లల మెదడు చురుకుగా పనిచేయాలంటే, ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ చేపలు తినాలన్నారు.

