NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క్రిష్ణగిరి మండలంలో డీఈఓ ఆకస్మిక తనిఖీలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  క్రిష్ణగిరి ఏపీ మోడల్ స్కూల్, ఎమ్మార్సీ కేంద్రం, కేజీబీవీ పాఠశాల, ఎరుకలచెరువు ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలను జిల్లా విద్యాధికారి శ్రీ ఎస్. శ్యామ్యూల్ పాల్  ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు.మోడల్ స్కూల్‌లో పాఠశాల ప్రార్థనలో పాల్గొన్న డీఈఓ , అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. సిలబస్ పూర్తి స్థితి, పాఠ్యాంశాల బోధన ప్రణాళిక, గణితం, ఫిజికల్ సైన్స్, ఇంగ్లీష్ తదితర సబ్జెక్టుల్లో విద్యార్థుల ప్రగతి గురించి వివరాలు తెలుసుకున్నారు. ఏ పాఠ్యాంశాలు క్లిష్టతరంగా ఉన్నాయో అడిగి తెలుసుకుంటూ, ఉపాధ్యాయులకు బోధన నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని, సాంకేతిక పద్ధతులను ఉపయోగించి పాఠాలను సులభంగా అర్థమయ్యే విధంగా బోధించాల్సిన అవసరాన్ని సూచించారు. ప్రతి విద్యార్థి ప్రగతిని పర్యవేక్షిస్తూ, డిసెంబర్ 6 నుంచి ప్రారంభమయ్యే వందరోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేసి పదో తరగతిలో 100% ఫలితాలు సాధించాలన్నారు.ఎమ్మార్సీ కేంద్రాన్ని సందర్శించిన డీఈఓ  రికార్డులు, హాజరు పట్టికలను పరిశీలించారు.ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయిని శ్రీమతి కృష్ణవేణికి విద్యార్థుల స్థాయికి అనుగుణంగా ఎలా బోధించాలో సూచనలు చేశారు. కిచెన్‌ను పరిశీలించి, ఆహార నాణ్యత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్శనలో ప్రిన్సిపల్ శ్రీమతి చైతన్య స్రవంతి మరియు సిబ్బంది పాల్గొన్నారు.ఎరుకలచెరువు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఉన్నత పాఠశాలలో పదో తరగతి జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం పాఠ్యాంశాల బోధన స్థితిని తెలుసుకుని, విద్యార్థులు ఎంతవరకు అర్థం చేసుకున్నారో పరిశీలించారు. రాబోయే పబ్లిక్ పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో సూచనలు ఇచ్చి, ఇంగ్లీష్ వ్యాకరణాంశాలను బోధించారు. పదో తరగతిలో నూటికి నూరు శాతం ఫలితాలను సాధించేందుకు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

About Author