NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రైవేటు సంస్థలతో రుణాల మంజూరుకు కృషి

1 min read

టిడ్కో గృహాలను త్వరితగతిన కేటాయించేందుకు చర్యలు

లబ్దిదారులతో మెప్మా పీడి శ్రీనివాసులు

కర్నూలు, న్యూస్​ నేడు: మంగళవారం టిడ్కో గృహాల లబ్దిదారులతో ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలతో రుణాలు మంజూరు చేయించేందుకు కృషి చేస్తున్నామని మెప్మా పీడి శ్రీనివాసులు అన్నారు. మంగళవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో మెప్మా సిఓలు ,ఆర్పీలతో సమావేశం నిర్వహించారు. మెప్మా పీడి మాట్లాడుతూ.. టిడ్కో ఇళ్ళుల పనులు త్వరితగతిన పూర్తి అవుతున్నాయని, లబ్దిదారులకు గృహాల అప్పగింత వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు. టిడ్కో నుండి రుణాలు మంజూరు కానీ లబ్దిదారులకు ఈజీ ఫైనాన్స్, ఐఎఫ్‌ఎఫ్ఎల్ ద్వారా రుణాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగానే లబ్ధిదారులు, ఫైనాన్స్ సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వడ్డీ ఇన్స్యూరెన్స్ తదితర అంశాలను వెల్లడించారు. యస్‌హెచ్‌జి సభ్యులు టిడ్కో గృహాల కోసం బుధవారం నుంచి సమావేశం జరుగుతుందని, లబ్దిదారులు హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో టిడ్కో అధికారి డాక్టర్ పెంచలయ్య, సిఎంఎం భాస్కర్ రెడ్డి, Cos, డిసిఓ తదితరులు పాల్గొన్నారు.

About Author