NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

30 లక్షల అభివృద్ధి పనులకు దాత ముందడుగు

1 min read

మహానంది, న్యూస్​ నేడు: మహానంది క్షేత్రంలో 30 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడానికి పెద్దయమ్మునూరుకు చెందిన  దాత మహేశ్వర్ రెడ్డి చంద్రశేఖరమ్మ దంపతులు ముందుకు వచ్చినట్లు ఆలయ ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం దాత స్వగృహం కర్నూల్ లో అంగీకార పత్రాన్ని కుదుర్చుకోవడం జరిగిందన్నారు. క్షేత్రంలోని రాజగోపురం ఎడమవైపున ఉన్న నవ వినాయకుల విగ్రహాల సమీపంలో ఉన్న కళాక్షేత్రాన్ని తాండూరు ప్రత్యేక రాళ్లతో ఫ్లోరింగ్ ఏర్పాటు కు 30 లక్షల రూపాయలతో చేయడానికి దాత ముందుకు వచ్చారన్నారు. దసరా శరన్నవరాత్రి  ,కార్తీక మాసం, పౌర్ణమి, మహాశివరాత్రి పర్వదినాల యందు కళాక్షేత్రంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటామని ఈవో తెలిపారు. దాత దంపతులను ఆలయ మర్యాదల సాంప్రదాయ ప్రకారం వారి స్వగృహంలో దుశ్యాలువతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ మధు, వేద పండితులు రవిశంకర్ అవధాని తదితరులు పాల్గొన్నారు.

About Author