టిడిపి కార్యాలయ ఆవరణలో కన్నుల పండుగగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ
1 min read

భక్తుల శరణు ఘోషతో మార్మోగిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం.
ఆధ్యాత్మిక వైభవంతో మెరిసిన ఎమ్మెల్యే ప్రాంగణం..
పత్తికొండ, న్యూస్ నేడు: స్వామియే శరణం అయ్యప్ప… హరిహర శరణం అయ్యప్ప… అంటూ వేలాదిమంది అయ్యప్ప మాలధారుల ఘోషతో మంగళవారం పత్తికొండ టిడిపి కార్యాలయం ప్రాంతం ఆధ్యాత్మిక కాంతుల్లో మునిగిపోయింది. పత్తికొండ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం భక్తులను అద్భుతమైన భక్తి ఆనుభూతికి చేరువ చేసింది.కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాన్ని కాశీ-శబరిమలై దేవాలయాల శైలిలో కనువిందుగా తీర్చిదిద్దారు. రంగురంగుల పుష్పాల అలంకరణలు, దీపాలతో ప్రకాశించే మంటపం, దేవతా మూర్తుల ఉత్సవ విగ్రహాల కలసి ప్రాంగణం మొత్తం దివ్యానుభూతిని పాలు పంచాయి.భక్తుల రాకతో ఈ ప్రాంతమంతా ఉత్సవ వాతావరణం నెలకొంది. గురు స్వాములు ఆధ్వర్యంలో సంప్రదాయ పద్ధతిలో పూజలను నిర్వహించటం, అయ్యప్పస్వామి విగ్రహానికి పాలాభిషేకం, నెయ్యాభిషేకం నిర్వహించారు.శాస్త్రోక్తంగా నిర్వహించిన పదునెట్టంబడి పూజలు అనంతరం పదునెట్టంబడిపై దీపాల ప్రదీపణం ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు.ఈ మహా పడిపూజ కార్యక్రమానికి వేలాదిమంది వేలాదిమందిభక్తులు హాజరయ్యారు. కుటుంబాలతో, మాలలతో, పేటతుళ్లితో పెద్ద సంఖ్యలో వచ్చిన అయ్యప్ప స్వాములు కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు..ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, అన్ని స్థాయిల , వివిధ శాఖల అధికారులు, భారీ సంఖ్యలో అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు.


