డిసెంబర్, 13న అన్ని కోర్టు ప్రాంగణాలలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా న్యాయమూర్తుల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి. స్థానిక జిల్లా కోర్టు లోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా ప్రధాన న్యాయమూర్తి/జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ జి.కబర్ధి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి ఆధ్వర్యంలో వచ్చే నెల డిసెంబర్ 13 న జరుగబోయే జాతీయ లోక్ అదాలత్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశములో కోర్టులలో పెండింగ్ ఉన్న సివిల్ మరియు రాజీ కాదగిన కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ఎక్సైజ్ కేసులు, చెక్ బౌన్స్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తులకు సూచించారు. జాతీయ లోక్ అదాలత్ ను డిసెంబర్ 13 వ తేదిన నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి రోజు ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్లను చేసి ఎక్కువ కేసులు పరిష్కరించేలా ప్రత్యేక దృష్టి సారించి ఈ లోక్ అదాలత్ ను విజయవంతం అయ్యేలా కృషి చేయాలని కోరారు. ఈ అవకాశమును కక్షిదారులు వినియోగించుకోని వారి కేసులను రాజీ పూర్వకంగా పరిష్కరించు కోవాలని కోరారు. ఈకార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాల జిల్లాల న్యాయమూర్తులు పాల్గొన్నారు.

