NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డిసెంబర్, 13న అన్ని కోర్టు ప్రాంగణాలలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:        కర్నూలు జిల్లా న్యాయమూర్తుల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి. స్థానిక జిల్లా కోర్టు లోని కాన్ఫరెన్స్ హాల్ నందు  జిల్లా ప్రధాన న్యాయమూర్తి/జిల్లా న్యాయ సేవాధికార సంస్థ  ఛైర్మన్ జి.కబర్ధి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ  కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి ఆధ్వర్యంలో  వచ్చే నెల డిసెంబర్ 13 న జరుగబోయే జాతీయ లోక్ అదాలత్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశములో కోర్టులలో పెండింగ్ ఉన్న సివిల్ మరియు రాజీ కాదగిన కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ఎక్సైజ్ కేసులు, చెక్ బౌన్స్ కేసులను  త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తులకు సూచించారు. జాతీయ లోక్ అదాలత్ ను  డిసెంబర్ 13 వ తేదిన నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి రోజు ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్లను చేసి  ఎక్కువ  కేసులు పరిష్కరించేలా ప్రత్యేక దృష్టి సారించి ఈ లోక్ అదాలత్ ను విజయవంతం అయ్యేలా కృషి చేయాలని కోరారు. ఈ అవకాశమును కక్షిదారులు వినియోగించుకోని వారి కేసులను రాజీ పూర్వకంగా పరిష్కరించు కోవాలని కోరారు.  ఈకార్యక్రమంలో  ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాల జిల్లాల న్యాయమూర్తులు  పాల్గొన్నారు.

About Author