NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజలకు మెరుగైన నీటి సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి వుంది

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: డోన్ శాసనసభ్యులు  కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్  రాజకుమారి గణియ శనివారం ప్యాపిలి మండలంలోని వెంగళంపల్లె చెరువును ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇరిగేషన్ శాఖ  అధికారులు కూడా ఈ సందర్శనలో పాల్గొని చెరువు ప్రస్తుత పరిస్థితి, నీటి పారుదల సామర్థ్యం, వర్షాకాలంలో వచ్చే నీటి ప్రవాహం, మరియు సాగునీటి అవసరాలపై వివరమైన నివేదికను సమర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్  చెరువు పరిసరాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించి, స్థానిక రైతులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు తెలుసుకున్నారు.ప్రజలకు మెరుగైన నీటి సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ప్రభుత్వాధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author