NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సామాజిక ప్రయోజనా నిధి నుండి ముఖ్యమంత్రి 2 కోట్లు నిధులు మంజూరు

1 min read

శ్రీ నగరేశ్వర,కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి సహకారం

ఏలూరు ఎమ్మెల్యే చూపిన చొరవ ప్రశంసనీయం,అభినందనీయం

ఏలూరు నగర ప్రజలు,ఆర్య వైశ్యులు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: హేలాపురి నగరంలోని చారిత్రాత్మక కట్టడాలను సంరక్షించే లక్ష్యంతో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. ఇదేక్రమంలో మరో మహత్తర కార్యక్రమానికి ఆయన చూపిన చొరవ అత్యంత ప్రశంసనీయంగా నిలిచింది. ఏలూరు అగ్రహారంలో చారిత్రాత్మక దేవాలయంగా విరాజిల్లుతోన్న శ్రీ నగరేశ్వర, కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రత్యేకంగా కలుసుకుని కోరారు. ఈ ఆలయాలు రోడ్డు ఎత్తు కంటే సుమారు నాలుగు అడుగులు దిగువన ఉండడంతో వర్షాకాలంలో గర్భాలయాల్లోనికి నీరుచేరి భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ పరిస్థితుల్లో ఈ ఆలయాల పునర్నిర్మాణం అత్యవసరమని సిఎంకు వివరించారు. ఏలూరు ఎమ్మెల్యేపై ప్రత్యేక అభిమానం చూపే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో వేగవంతంగా స్పందించారు. దేవాదాయ సామూహిక ప్రయోజన నిధి నుండి 2కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారు. దీంతో ఈ విషయంలో ఎమ్మెల్యే బడేటి చంటి చూపించిన చొరవ పట్ల ఏలూరు నగరానికి చెందిన ఆర్యవైశ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంతో ఎమ్మెల్యే బడేటి చంటి ఆర్యవైశ్య పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య నాయకులు దివ్వెల జై బాబు, పోరా రామకృష్ణ రావు, మద్దుల సత్య కుమార్, దేశ నరసింహారావు,గూడవల్లి శ్రీనివాస్(వాసు)ముఖ్యమంత్రి చంద్రబాబుకు,ఎమ్మెల్యే బడేటి చంటికి వారు ధన్యవాదాలు తెలిపారు.

About Author