పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంకుల్లో ఉత్తమ సేవలందించిన సిబ్బంది కి ప్రోత్సాహక బహుమతులు
1 min read

ప్రజలకు మర్యాదపూర్వకంగా ఉత్తమ సేవలు అందించే వారికి ప్రతి నెల ఇటువంటి ప్రోత్సాహ బహుమతులు అందిస్తాం
జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లాలో పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో నడుస్తున్న కైకలూరు మరియు ఏలూరు టౌన్‌లోని మూడు పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంకుల్లో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ మంగళవారం నగదు ప్రోత్సాహక బహుమతులు అందించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూసేవా నిబద్ధత పెట్రోల్ బంకుల్లో పనిచేసే సిబ్బంది విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేయాలని, ముఖ్యంగా ప్రజలతో మర్యాద పూర్వకంగా నడుచుకుంటూ వారికి నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు.పెట్రోల్ బంకు లో పని చేసే వారు ఉత్తమ సేవలు అందించే వారికి గుర్తింపుగా ప్రతినెలా నగదు ప్రోత్సాహక బహుమతులు అందిస్తామని, తద్వారా సిబ్బందిలో మరింత ఉత్సాహం పెరుగుతుందని తెలిపారు.ఏలూరు జిల్లా పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంకులను విజయవంతంగా నడుపుతున్నందుకు, మరియు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నందుకు ఎస్పీ ఉద్యోగులను అభినందించారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ సతీష్ , ఏఆర్ ఎస్ఐ రవీంద్ర మరియు పెట్రోల్ బంకుల్లో పని చేసే ఉద్యోగులు పాల్గొన్నారు.

