NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రామాయణం ప్రతి ఇంటినీ ప్రభావితం చేస్తుంది

1 min read

డాక్టర్ మల్లు వేంకట రెడ్డి, తి.తి.దే.

నాగలూటిలో ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు

కర్నూలు, న్యూస్​ నేడు: శ్రీమద్రామాయణం భారతీయుల నందరినీ ఏదో ఒకవిధంగా ప్రభావితం చేస్తుందని, రామాయణం లేని భారతీయ సమాజాన్ని ఊహించుకోలేమని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకట రెడ్డి అన్నారు. మిడుతూరు మండలం, నాగలూటి గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం నందు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఆధ్వర్యంలో  ధార్మిక కార్యక్రమాలను వారు ప్రారంబించారు. స్థానిక భజన మండలిచే భజనలు, తదనంతరం గరుడాద్రి వనజ కుమారి శ్రీమద్రామాయణంలో ప్రభావిత స్త్రీ పాత్రల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయకమిటీ చైర్మన్ సర్వేశ్వర రెడ్డి, గ్రామ సర్పంచ్ ఉషారాణి, చిన్న పుల్లారెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ తులసిరెడ్డి, నాగిరెడ్డి, బి. ఎల్లారెడ్డి, టి. వెంకట రమణారెడ్డి, టి. వెంకటరెడ్డి, బి. రమణారెడ్డి, నీలకంఠేశ్వరప్ప, రాంభూపాల్ రెడ్డి, చిన్న ఎల్లారెడ్డి, కట్ట నాగిరెడ్డి, ఎ.శివశంకర్ రెడ్డితోపాటు భజనమండలి సభ్యులు పాల్గొన్నారు.

About Author