గర్భవతులను గుర్తించడంలో నిర్లక్ష్యం ఉండకూడదు
1 min read

ప్రసూతి మరణాలు, శిశు మరణాలు తగ్గించడానికి గర్భిణుల ముందస్తు గుర్తింపు కీలకం
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు: ప్రసూతి మరణాలు, శిశు మరణాలు తగ్గించడానికి గర్భిణుల ముందస్తు గుర్తింపు కీలకమని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు.మంగళవారం చిప్పగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి వార్డు లను, మందుల గడువు తేదీని పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా ఓపీ రిజిస్టర్ ను పరిశీలిస్తూ ఎటువంటి కేసుల మీద ఇక్కడ ఎక్కువగా ప్రజలు వస్తుంటారనే విషయాన్ని కలెక్టర్ మెడికల్ ఆఫీసర్ ను అడిగి తెలుసుకున్నారు… ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రజలు నమ్మకంగా వచ్చే ప్రదేశాలని రోగుల పట్ల సిబ్బంది మరింత శ్రద్ధ చూపి వైద్య సేవలు అందించాలన్నారు.. వైద్య సిబ్బంది అందరూ సమయానికి విధుల్లో ఉండాలని, విధుల పట్ల నిర్లక్ష్యం ఉండకూడదన్నారు..ప్రెగ్నెంట్ రిజిస్టర్ ను పరిశీలిస్తూ ఇక్కడ ఎన్ని డెలివరీలు అయ్యాయి అని అడిగి తెలుసుకున్నారు… హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు ఎక్కువగా ఎలాంటి కేసులు నమోదు అవుతాయనే విషయాన్ని కలెక్టర్ మెడికల్ ఆఫీసర్ ని అడిగి తెలుసుకున్నారు.. ఆరోగ్య కేంద్రంలోని ప్రతి విభాగాన్ని కలెక్టర్ సందర్శిస్తూ రోగులకు అందిస్తున్న సేవలపై సిబ్బందితో వివరాలు తెలుసుకున్నారు.అధిక ప్రమాద గర్భిణులను (High Risk Pregnancies) ప్రత్యేకంగా గుర్తించి వైద్య అధికారుల పర్యవేక్షణలో ఉంచాలని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో డి ఎం హెచ్ ఓ డా.భాస్కర్ రాజు, మెడికల్ ఆఫీసర్ ఆఫ్రోజ్ జహాన్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

