వార్షిక ఆదాయ లక్ష్యాలను అధిగమించండి
1 min read
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: జిల్లాలో ప్రధాన ఆదాయ వనరులైన ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, రిజిస్ట్రేషన్, రవాణా విభాగాలకు కేటాయించిన వార్షిక లక్ష్యాలను వంద శాతం అధిగమించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. బుధవారం నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆదాయ వనరుల పెంపుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, డిఆర్ఓ రాము నాయక్ సహా సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, ఆదాయం తెచ్చిపెట్టే శాఖల్లో వనరుల వినియోగం, పర్యవేక్షణ, లక్ష్య సాధనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి కేటాయించిన లక్ష్యాన్ని అధిగమించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చేపట్టిన అంశాలపై తరచూ సమీక్షలు నిర్వహించి లోపాలను గుర్తించి వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. ఎక్సైజ్ శాఖలో గత ఏప్రిల్ నుండి నవంబర్ మాసం వరకు నిర్ణయించిన 596.63 కోట్ల లక్ష్యాన్ని అధిగమించి 640.86 కోట్లు సాధించడమే కాకుండా 7.14 శాతం వృద్ధి రేటు నమోదు చేయడం జరిగిందన్నారు.ఆదాయం సృష్టించే వనరులపై అధికారులు నిరంతర పర్యవేక్షణ సాగించాలని, లక్ష్యాల సాధనలో ఎట్టి రాజీ లేకుండా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

